Rajasthan Royals vs Kolkata Knight Riders, 70th Match: వర్షం కారణంగా KKR, RR మ్యాచ్ రద్దయింది. టాస్ అనంతరం మరోసారి వర్షం మొదలడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

దీంతో టేబుల్ లో 20 పాయింట్లతో KKR టాప్ ప్లేస్ లో ఉండగా…. SRH 17(నెట్ రన్ రేట్+0.414), RR 17(నెట్ రన్ రేట్+0.273), RCB(14 పాయింట్లు) 2,3,4 స్థానాల్లో నిలిచాయి. ప్లేఆఫ్స్ లో KKR-SRH(Q1), RR-RCB(E) తలపడనున్నాయి. అయితే… వర్షం కారణంగా KKR, RR మ్యాచ్ రద్దు కావడం హైదరాబాద్ జట్టుకు కలిసి వచ్చిందని చెప్పవచ్చును. KKR, RR మ్యాచ్ లో ఒకవేళ రాజస్థాన్ గెలిచి ఉంటే…హైదరాబాద్ కు 3వ స్థానమే దక్కేది.