సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్ లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.
కాగా, ఇప్పటికే టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ కేబినేట్ సమావేశం ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.