Rajasthan Royals vs Mumbai Indians, 38th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో ఫైట్ జరగనుంది. ఇప్పటివరకు 37 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ 38వ మ్యాచ్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు జైపూర్ వేదికగా జరగనుంది.
ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లో ఉంది. కానీ ముంబై మాత్రం కింది నుంచి 4వ ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే ప్లే ఆఫ్ కష్టాలు మొదలవుతాయి. మరి ఇవాళ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుందో చూడాలి.