ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. లక్నో 20 ఓవర్లకు 180 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయింది. చివర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులు చేసింది. మార్కరమ్ 66 పరుగులు చేయగా.. బదోనీ హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు.
మిచెల్ మార్ష్ 4, నికోలస్ పూరన్ 11, రిషబ్ పంత్ 3 విఫలం చెందారు. డేవిడ్ మిల్లర్ 7 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. హసరంగ 2, ఆర్చర్ 1, సందీప్ శర్మ 1 తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి.. 20 ఓవర్లకు 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యంతో మరికొద్ది సేపట్లోనే బరిలోకి దిగనుంది రాజస్థాన్ రాయల్స్. గత మ్యాచ్ ఓడిపోయిన రాజస్థాన్ ఈ మ్యాచ్ విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.