విచారణలో కీలక విషయాలు వెల్లడించారు శ్రీరెడ్డి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో విచారణకు హాజరైన శ్రీరెడ్డి.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ PS లో విచారణకు హాజరయ్యారు. శ్రీరెడ్డి ఈ సందర్బంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

సోషల్ మీడియాలో నేను చేసిన పోస్టులు పూర్తిగా నా వ్యక్తిగతం అన్నారు. వైసీపీ, జగన్ పై ఉన్న అభిమానంతోనే పోస్టులు పెట్టాను… పోస్టులకు సంబంధించి నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని క్లారిటీ ఇచ్చారు. కేవలం నా ఫేస్బుక్ ఖాతాలో మాత్రమే పోస్టులు పెట్టాను… జగన్ పై అభిమానంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టానన్నారు.