Ricky Ponting, Stephen Fleming on BCCI’s radar for India head coach job: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పోస్ట్ కు బీసీసీఐ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారంటూ వచ్చిన వార్తలపై సీఎస్కే యాజమాన్యం స్పందించింది. తమకు అటువంటి సమాచారం ఏమీ లేదని…. ఇవన్నీ ఊహగానాలేనని కొట్టి పారేసింది.

ఒకవేళ ఫ్లెమింగ్ భారత కోచ్ గా వెళ్లాలని భావిస్తే నిబంధనల్ని అనుసరించి ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే… సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కంటే రికీ పాంటింగ్ నే భారత కోచ్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆసీస్ జట్టును మూడు సార్లు ఛాంపియన్గా నిలిపారు రికీ పాంటింగ్ అందుకే రికీ పాంటింగ్ నే భారత కోచ్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.