చరిత్ర సృష్టించిన రొనాల్డో.. 100 కోట్లకు చేరిన ఫాలోవర్స్

-

ప్రముఖ ఫుట్‌బా‌లర్, పోర్చుగీస్ సంచలనం క్రిస్టియానో రొనాల్డో సరికొత్త సంచలనం సృష్టించాడు. సాకర్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఎదిగిన రొనాల్డో తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రొనాల్డోకు అభిమానులు ఉన్నారు. ఆదాయంలోనూ మనోడు నెంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా సోషల్ మీడియా ఫాలోలింగ్‌లో రొనాల్డో సంచలనం సృష్టించాడు.

అన్ని ప్లాట్ ఫామ్స్‌లలో కలిపి 100 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ‘ఇది చాలా ఎక్కువ. మీ ప్రేమకు నా నిదర్శనం. నా కుటుంబం, మీకోసం ఆడాను. ఇప్పుడు నాతో 1 బిలియన్ మంది ఉన్నారు. ఏ పరిస్థితుల్లో అయినా మీరు నాతోనే ఉన్నారు. అందుకు ఎప్పటికీ కృతజ్ఞుడినై ఉంటాను. మనమంతా కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయం తెలిసి ప్రపంచం నలుమూలలా ఉన్న రొనాల్డో ఫ్యాన్స్ తెగ సంబుర పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version