ముంబై కి షాక్.. హిట్ మ్యాన్ ఔట్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత ముంబై బ్యాటింగ్ చేస్తోంది. దీంతో క్రీజులోకి వచ్చిన రికెల్టన్ తొలి రెండు ఓవర్లు ఆడి 19 పరుగులు చేశాడు. ఇక మూడో ఓవర్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరుస బంతుల్లో రెండు సిక్స్ లు కొట్టిన తరువాత మయాంక్ బౌలింగ్ లో నాలుగో బంతికి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు రోహిత్.

రోహిత్ శర్మ పై ముంబై ఇండియన్స్ అభిమానులు ఇవాళ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఔట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ ఇవాల రెండు సిక్స్ లు కొట్టాడు. ఇంకా 3 సిక్సులు కొడితే మరో రికార్డు చేరే అవకాశం ఉంది. ఈ టోర్నీలో 300 సిక్సులు కొట్టిన తొలి ఇండియన్ బ్యాటర్ గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 297 సిక్సులతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు రోహిత్. కోహ్లీ 285 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. 

Read more RELATED
Recommended to you

Latest news