వంశీను, ఆంజనేయులను ఒకే సెల్ లో పెట్టండి అంటూ డిమాండ్ చేశారు బుద్దా వెంకన్న. జైలు సూపరింటెండెంట్ గారికి… విజయవాడ జైల్లో ఎవరైనా తోడు కావాలంటూ కోరుతున్న వంశీ..! ఎక్కడ ఉన్నా “పక్క”న ఎవరో ఒకరు ఉండాలి పీఎస్సార్ ఆంజనేయులుకి..వీరిద్దరిని ఒకే సెల్ లో పెట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు బుద్దా వెంకన్న.

కాగా, ముంబై నటి జత్వానీని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి విజయవాడ కోర్టుకు తరలించారు. ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కి పీఎస్సార్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఐడీ అధికారులు విచారించనున్నారు.