Sourav Ganguly : 65 ఏళ్ల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఓ క్రికెటర్..!

-

బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ పదవికి పోటీలో ఉన్న వారిలో మిగతావారికన్నా గంగూలీకే అధిక అవకాశాలు ఉన్నట్టు క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో గంగూలీ మాట్లాడుతూ..బీసీసీఐ ప్ర‌తిష్ట‌ను బ‌లోపేతం చేసేందుకు ఇదో మంచి త‌రుణ‌మ‌న్నారు.

భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన తనకు ఇది ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదని, ఇమేజ్ దెబ్బతిందని… ఇలాంటి స్థితిలో తాను పగ్గాలు చేపట్టబోతున్నానని చెప్పారు. శ‌వాళీ క్రికెట్ ఆడే ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్లను ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డ‌మే త‌న మొద‌టి క‌ర్త‌వ్య‌మ‌న్నారు. డొమెస్టిక్ క్రికెట్ ను బలోపేతం చేసే క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే తన ప్రథమ కర్తవ్యమని గంగూలీ చెప్పారు.

తన తొలి ప్రాధాన్యత ఫస్ట్ క్లాస్ క్రికెటర్లే అయినప్పటికీ… తన ఆలోచనపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అలాగే ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అతి పెద్ద ఆర్గనైజేషన్ అని, ఆర్థికంగా ఒక పవర్ హౌస్ వంటిదని, అలాంటి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం ఒక ఛాలెంజ్ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news