టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీకి ఊహించని షాక్ తగిలింది. సౌరవ్ గంగూలీ ఇంట్లో రాత్రి భారీ దొంగతనం జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సౌరవ్ గంగూలీ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కోల్కత్తా నగరంలోని బెహాలా లో ఉన్న గంగుల ఇంట్లో దొంగతనం జరిగింది.
ఈ సందర్భంగా ఏకంగా సౌరవ్ గంగూలీ ఇంట్లో ఉన్న 1.6 లక్షల విలువైన ఫోన్ ను దొంగతనం చేశారు దుండగులు. ఈ నేపథ్యంలోనే వెంటనే పోలీసులను ఆశ్రయించారు సౌరవ్ గంగూలీ. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వ్యక్తుల పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.