టీ20 వరల్డ్ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీస్ పోరులో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 57 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈరోజు(గురువారం) రాత్రి ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్స్ మ్యాచ్‌లో విజేతతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడనుంది.
కాగా, కాగా, మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ జట్టు 11.5 ఓవర్ లో 56 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్ (0), జర్దాన్ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ఒమర్జాయ్ ప్రయత్నించినా నోకియా బౌలింగ్‌లో స్టబ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (8) కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. ఆ లక్ష్యాన్ని… తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా.