నంద్యాలలో చిరుత మళ్ళీ కలకలం రేపింది. నంద్యాల, గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని పచర్ల వద్ద చిరుత మళ్ళీ కలకలం రేపింది. ఫారెస్ట్ టోల్ గేట్ ప్రాంతంలో చిరుత సంచారం చేస్తోంది. గాజులపల్లె నుండి గిద్దలూరు వెళ్తున్న ఆటోపై నుండి జంప్ చేసి అడవిలోకి వెళ్లింది చిరుత.
అయితే… అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు ప్రయాణికులు. నిన్న ఆర్టీసీ బస్ ను క్రాస్ చేసిన చిరుత… పచర్ల వద్ద చిరుత మళ్ళీ కలకలం రేపింది. ఈ తరుణంలోనే… ఘాట్ రోడ్డులో బైక్ పై వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు అటవీ అధికారులు. చిరుతను బంధించడానికి ప్రయత్నిస్తున్నారు అధికారులు.
ఇక అటు ఏలేశ్వరంలో కొండచిలువకు శస్త్ర చికిత్స చేశారు పశుసంవర్ధక శాఖ అధికారులు. రోడ్డు దాటుతుండగా కొండచిలువ పైనుంచి దూసుకుని వెళ్లింది ఓ వాహనం. పేగులు బయటకు వచ్చినట్లు గుర్తించిన అటవీశాఖ అధికారులు…ట్రీట్మెంట్ చేశారు. కొండచిలువను మూడు రోజులపాటు రాజమండ్రి ఫారెస్ట్ పునరావాస కేంద్రంలో పరిశీలనలో ఉంచుతామని వెల్లడించారు. ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత అడవిలో వదిలేలా చర్యలు తీసుకుంటామన్నారు.