సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన శ్రీలంక మిడిలార్డర్లు..!

-

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల జోరు కనిపిస్తోంది. 1 పరుగు వద్దనే బుమ్రా ఫస్ట్ వికెట్ తీశాడు. అనంతరం శ్రీలంక టాప్ ఆర్డర్ ను హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూల్చేశాడు. శ్రీలంక 5.4 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 12 పరుగుల వద్దనే 6 వికెట్లు కోల్పోవడం శ్రీలంక కు కష్టకాలం అనే చెప్పాలి. సిరాజ్ కి 5 వికెట్లు, బుమ్రాకు 1 వికెట్ పడింది. కుషాల్ పెరెరా, నిస్సంక, సమర విక్రమ, షనక, అసలంక, సిల్వ ఔట్ అయ్యారు.

ప్రస్తుతం కాస్త నిలకడగా ఆడుతున్నారు. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నాడు. శ్రీలంక టాస్ ఎంచుకోవడం భారత్ కి కలిసి వచ్చిందనే చెప్పాలి. అజంత మెండిస్, వెల్లలాగే బ్యాటింగ్ చేస్తూ కాస్త నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 9.4 ఓవర్లకు 31-6 ఉంది. ఇలాగే కంటిన్యూ చేస్తే ఓ 150 పరుగులు సాధించే అవకాశముంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం దాదాపు ఖాయమైనట్టు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news