ENGతో తొలి టెస్ట్ లో ఓటమిపై టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల లీడ్ రావడంతో గెలుస్తాం అనుకున్నాం. కానీ పోప్ అద్భుతంగా ఆడాడు. ఇండియాలో విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే. 230 పరుగులు చేదించడం కష్టమేం కాదు. కానీ మేము బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. లోయర్ ఆర్డర్ చాలా బాగా ఆడింది. వారిని చూసి పరుగులు ఎలా చేయాలో టాపార్డర్ నేర్చుకోవాలి’ అని అన్నారు.
ముఖ్యంగా శుభమన్ గిల్(0) దారుణ వైఫల్యం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(39) మరోసారి దూకుడుగా భారత ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే వీరి జోరుకు హార్ట్ లీ బ్రేక్ వేశారు. యశస్వి(15)ని క్యాచ్ అవుట్ గా పెవీలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన గిల్ ను సిల్వర్ డక్ చేశాడు. దాంతో భారత్ రెండు పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇది భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసింది.