మిర్యాలగూడ ప్రమాదంలో ఆరుకు చేరిన మృతులు.. లారీని గుర్తించిన పోలీసులు

-

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మిర్యాలగూడ బైపాస్‌లోని కృష్ణమానస కాలనీ వద్ద అదుపుతప్పిన కారుడివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలకు వెళ్లి కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం చెరుపల్లి మహేష్ (34), జ్యోతి (30), యశిక (6), బొమ్మా మశ్చేందర్‌ (29 ), మాధవి (24 ), లియాన్స్ (2) మరణించారు.

ఈ నెల 26వ తేదీన రెండు కార్లలో 13 మంది కుటుంబసభ్యులు ఏపీలోని పలు ఆలయాల సందర్శనకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తున్న సమయంలో మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరతామనేలోగా నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామస్థులుగా గుర్తించారు. మరోవైపు ఈ కారు ఢీకొట్టిన లారీని కూడా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version