2023 ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్తాన్ కి వెళ్లడం లేదని స్పష్టం చేసింది బీసీసీఐ. నాలుగు రోజుల క్రితం టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించిందని. పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2023 లో పాల్గొనేందుకు భారత జట్టును పాకిస్తాన్ పంపేందుకు భారత క్రికెట్ బోర్డు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే తటస్థ వేదికలపై మాత్రమే పాకిస్తాన్ తో ఇండియా తలబడుతుందని.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ వెళ్ళదని స్పష్టం చేసింది బీసీసీఐ.
2008లో భారత్ చివరిసారిగా పాకిస్తాన్ లోని కరాచీలో మ్యాచ్ ఆడింది. ఆ తరువాత ఇంతవరకు మళ్ళీ పాకిస్తాన్ కి వెళ్ళలేదు. కొన్ని కారణాలవల్ల భారత్ – పాకిస్తాన్ మధ్య మంచి సంబంధాలు లేవు. దీంతో పాక్ జట్టు భారత్ లో మ్యాచులు ఆడడం కానీ.. టీమిండియా పాకిస్తాన్ లో మ్యాచ్ లు ఆడడం గాని జరగడం లేదు.