IPL 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్ వేదికగా సాయంత్రం 7: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో చివరిన నిలిచిన SRH సొంతగడ్డపై సత్తా చాటాలని భావిస్తోంది.

వరుస పరాజయాలకు చెక్ పెట్టాలని పట్టుదలతో ఉంది. మరో వైపు GT హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఉప్పల్‌లో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
SRH XI ప్లేయింగ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (c), అభినవ్ మనోహర్, జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ
GT XI ప్లే: శుభమాన్ గిల్ (c), జోస్ బట్లర్ (wk), సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, R సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ