తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరో సాంగ్ వచ్చింది. కేసీఆర్ పై ఆర్టిస్ట్,గాయకుడు ఈశ్వర్ రూపొందించిన పాటను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో ‘తెలంగాణ జాతిపిత కేసీఆర్ పాట’ పేరుతో ఉన్న సీడీ నమూనాను బిఆర్ఎస్ అధినేత ఆవిష్కరించారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ వేదికగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు కీలక సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు ఉద్యమపార్టీ అయిన బీఆర్ఎస్ కే తెలుసు అని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థం అయిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలేవో.. నీళ్లు ఏవో తెలిసిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాగు, తాగునీరు, విద్యుత్ రంగాలలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కేసీఆర్ పై ఆర్టిస్ట్,గాయకుడు ఈశ్వర్ రూపొందించిన పాటను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు.
శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో 'తెలంగాణ జాతిపిత కేసీఆర్ పాట' పేరుతో ఉన్న సీడీ నమూనాను బిఆర్ఎస్ అధినేత ఆవిష్కరించారు.@BRSparty @KCRBRSPresident pic.twitter.com/jSW1Stg6mJ
— Telangana Awaaz (@telanganaawaaz) April 5, 2025