టీ20 ప్రపంచకప్‌లో అమెరికా సంచలనం.. పాక్​పై సూపర్‌ ఓవర్‌లో విజయం

-

2024 టీ20 వరల్డ్​కప్​లో పసికూన అమెరికా చేతిలో పాకిస్థాన్ పరాజయం పాలైంది. గ్రూప్‌ ఎ లో డల్లాస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో అమెరికా విజయం సాధించింది. ఇద్దరూ పోటాపోటీగా ఆడినా స్కోర్లు సమం కావడం వల్ల సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. ఈ నేపథ్యంలో సూపర్‌ ఓవర్లో మొదట అమెరికా 18 పరుగులు చేయగా, పాకిస్థాన్‌ 13 మాత్రమే చేసి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్​ను అమెరికా బాగానే కట్టడి చేసింది. బౌలింగ్​కు సహకరిస్తున్న పిచ్​పై బౌలర్లు చెలరేగిపోయారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఇందులో 7 రన్స్‌ ఎక్స్‌ ట్రాలే. 19 పరుగుల లక్ష్యఛేదనలో పాక్‌ 13/1 రన్స్‌కు పరిమితమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version