మాజీ ఇండియా కెప్టెన్ మరియు ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటతో మరియు తనదైన మంచితనంతో ప్రపంచం నలువైపులా కోట్లాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆట తీరు, వ్యక్తిత్వంతో దేశ ,విదేశాలలో అభిమానులను సంపాదించుకున్నడు.
ధోనీ తనదైన కెప్టెన్సీ తో క్రికెట్ కెరియర్లో ఎన్నో మ్యాచ్లలలో విజయాలను అందించాడు. ధోని ఇండియాకి రెండు ప్రపంచా కప్ లను అందించాడు. అయితే..కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారన్న విషయం తెలిసిందే. అలాంటి ధోని ఓ ప్రైవేట్ పార్టీలో హుక్కా తాగుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్ జార్జ్ బెయిలీ గతంలో ధోనికి హుక్కా పొగతాగడం ఇష్టమని చెప్పిన మాటలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇది యాడ్ షూట్ కు సంబంధించినదా? లేక నిజంగానే ధోని సేవించారా? అనేది తెలియాల్సి ఉంది.