వైరల్: గంగూలీని డాడీ అన్న సచిన్‌.. సచిన్, గంగూలీ కామెంట్స్ చూసారా…?

-

టీం ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్, ప్రస్తుత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య స్నేహం గురించి అందరికి తెలిసిందే. వీరు ఇద్దరు మైదానంలో ఎంత స్నేహంగా ఉండే వారో ఆ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకున్నా సరే వారి స్నేహం అలాగే ఉంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఇద్దరి సంభాషణ సరదాగా మారింది. అభిమానులకు మంచి వినోదాన్ని పంచారు ఇద్దరూ.

సౌరవ్ గంగూలీ తాను వ్యాయామం చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసాడు. “చల్లని ఉదయం మంచి ఫిట్‌నెస్ సెషన్ చాలా ఫ్రెష్‌గా ఉంది….” అని పోస్ట్ చేయగా దానికి స్పందించిన సచిన్, తనదైన శైలిలో స్పందించాడు. “బాగుంది డాడీ! క్యా బాత్ హై” అని టెండూల్కర్ పేర్కొన్నాడు. దానికి రిప్లయ్ ఇచ్చిన సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ థాంక్స్ ఛాంపియన్,  ఎప్పుడూ ఫిట్నెస్ ఫ్రీక్ .

నీకు గొప్ప శిక్షణా రోజుల గురించి గుర్తున్నాయా” అని ప్రశ్నించాడు. “ఎస్ డాడీ .. మీరు శిక్షణను ఎంతగా ఎంజాయ్ చేశారో మాకు తెలుసు! ముఖ్యంగా ‘స్కిప్పింగ్’ ‘అని టెండూల్కర్ గంగూలీని ఆటపట్టించాడు. అది అలా ఉంటే వీరి ఇద్దరి పార్ట్నర్షిప్ అంతర్జాతీయ క్రికెట్ లో చెరగని ముద్ర వేసింది. ఇద్దరి భాగస్వామ్యంలో 176 ఇన్నింగ్సులలో 26 సెంచరీలు నమోదు చేయగా 8227 పరుగులు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version