మహేష్ దెబ్బకు బన్నీషాక్ ! అసలు కోలుకోలేని దెబ్బ !!

-

 

సూపర్ స్టార్ మహేష్ హీరోగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రం మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరోని తమకు నచ్చిన మాస్ రోల్ లో చూశాము అని ప్రేక్షకులు అంతా తెగ సంబర పడిపోతున్నారు. క్లైమాక్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నా కామెడీ మరియు మహేష్ – అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ షాట్లతో సూపర్ స్టార్ ఈ సంక్రాంతికి తన రాకను ఘనంగా ప్రకటించినట్లే.

 

అయితే 12వ తేదీ కోసం ముందు నుండి మహేష్ మరియు బన్నీ ఇద్దరూ పోటీ పడగా మహేష్ బాబు తన సినిమా విడుదలను రోజు ముందు జరుపుకుంటే అందరూ బాబు జంకాడు అని అనుకున్నారు. అయితే మార్కెట్ పరంగా బన్నీ కన్నా చాలా ఎక్కువ ఉన్న మహేష్ ఈ రోజు వచ్చినా టాక్ తో తన తర్వాతి రోజు షో లు అన్ని నింపేసుకున్నాడు.

పైగా ‘సరిలేరు..’లో దిల్ రాజు నిర్మాణ భాగస్వామి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ థియేటర్లు ఆయన చేతుల్లో ఉన్నాయి. దీంతో ‘అల..’ కంటే దీనికి ఎక్కువ థియేటర్లు కేటాయించారు. పైగా ముందు రిలీజవుతుండటం దీనికి కలిసొచ్చింది. ఐతే ‘అల..’ సినిమాకు ఈ అడ్వాంటేజీ లేదు. అప్పటికి ‘సరిలేరు..’ థియేటర్లలో ఉంటుంది కాబట్టి దీనికి సగం థియేటర్లే దక్కుతాయి. దీంతో షేర్ కూడా తక్కువ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version