శుక్రవారం మెల్బోర్న్ లో సిడ్నీ సిక్సర్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) మ్యాచ్ సందర్భంగా స్టీవ్ స్మిత్ ఒక ఆశ్చర్యకర అవుట్ నుంచి త్రుటిలో బయటపడ్డాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్ విసిరిన బంతిని ఆడే క్రమంలో స్మిత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో అతను వెనక్కు వాలిపోయాడు. దీనితో స్టంప్స్ కి ఉన్న లైట్స్ వెలిగాయి.
దీనితో అందరూ అవుట్ అని భావించారు. అయితే రిప్లయ్ లో అతను అవుట్ కాదని తెలిసింది. రౌఫ్ చేసిన ఎనిమిదవ ఓవర్ ఐదవ బంతిలో, స్మిత్ డిఫెన్స్ ఆడాడు. వెనక్కి పడగా అతను హిట్ వికెట్ అని భావించారు. అతను బైల్స్ పడిన విషయాన్ని గుర్తించకుండా పరుగు తీసాడు. దీనితో ప్రత్యర్ధి ఆటగాళ్ళు అందరూ అతను అవుట్ అని సంబరాలు చేసుకున్నారు.
కాని హిట్ వికెట్ రిప్లయ్ లో అతను అవుట్ కాదని, అతని గాలి వేగంతో బైల్స్ పడ్డాయని గుర్తించి నాటౌట్ గా గుర్తించారు. అయితే 13 వ ఒవలో స్మిత్ ఆడం జంపా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ని బిగ్ బాష్ లీగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. స్మిత్ ఒక సిక్సర్‌తో సహా 18 బంతుల్లో 24 పరుగులు చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hit wicket? Don't think so! ?
The wind has just had a go at getting Steve Smith out! ?A @KFCAustralia Bucket Moment | #BBL09 pic.twitter.com/saGREjWJmO
— KFC Big Bash League (@BBL) January 31, 2020