టీమిండియా మాజీ కెప్టెన్, డ్యాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో రికార్డులను అలవోకగా అందుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా సోషల్ మీడియాలోనూ ఓ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు.. కానీ.. అతని ఫాలోవర్లు సోషల్ మీడియాలో నిరంతరం పెరుగుతూనే ఉన్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో ఈ ప్లేయర్ ను అనుసరించే వారి సంక్య 200 మిలియన్లకు పెరిగి పోయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ స్థానం సాధించిన తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ బ్యాట్‌తో పరుగులు చేసినా.. చేయకపోయినా.. అతని రికార్డులు చెక్కు చెదరడం లేదు.
ఈ విషయాన్ని విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించారు.కాగా.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం నుంచి 5 టీ 20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చారు. అతను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ లో పెద్దగా రాణించకపోవడం గమనార్హం.