టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు వీరేంద్ర సెహ్వాగ్ సిద్ధమైనట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాదాపు పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడట వీరేంద్ర సెహ్వాగ్. గత కొన్ని రోజులుగా తన భార్య ఆర్తి తో గొడవ పడి… వేరు వేరు గానే ఉంటున్నాడట వీరేంద్ర సెహ్వాగ్. మొన్న దీపావళి పండుగ నుంచి ఇప్పటివరకు వారిద్దరు కలిసిన దాఖలాలు లేవని చెబుతున్నారు.
దీపావళి పండుగ సమయంలో కూడా తన కొడుకు ఫోటోలు షేర్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. తన భార్య ఆర్తి ఫోటో మాత్రం పెట్టలేదు. ఇటీవల దైవ దర్శనాలకు వెళ్తున్న వీరేంద్ర సెహ్వాగ్… సింగిల్ ఫోటోలనే షేర్ చేస్తున్నాడు. దీంతో వీళ్ళ విడాకులు పక్కా అయిపోయినట్లు.. నేషనల్ మీడియా కోడైకుస్తోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.