సాధారణంగా కోటి విద్యలు కూటి కొరకే అంటారు మన పెద్దలు. ఇదే డైలాగ్ ను ఓ సినిమాలో కూడా వాడారు. మనిషి బతకడానికి కోటి విద్యలు ఉన్నాయట. అయితే ఎలా పడితే అలా బతికితే మాత్రం అస్సలు కుదరదు. సమాజంలో కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ రూల్స్ కి విరుద్దంగా వ్యవహరిస్తే.. జైలుకు వెళ్లాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. బతుకుదెరువు కోసం వచ్చిన ఓ యువతి నకిలీ ఐఏఎస్ అవతారమెత్తి హల్ చల్ సృష్టించింది.
తాజాగా ఆ యువతి పోలీసుల చేతికి చిక్కింది. వివరాల్లోకి వెళ్లితే..అమృత భాగ్యరేఖ అనే యువతి ఏకంగా ట్రైనీ ఐఏఎస్ అవతారమెత్తింది. విశాఖలో ట్రైనీ ఐఏఎస్ ను కిలాడీ లేడీ హల్ చల్ సృష్టిస్తోంది. విశాఖ పోలీసులు రంగంలోకి దిగి నకిలీ ఐఏఎస్ బండారాన్ని బట్టబయలు చేశారు. అమృత భాగ్యరేఖ నకిలీ ఐఏఎస్ అని విశాఖ సీపీ తెలిపారు. డీసీపీ ఆధ్వర్యంలో నకిలీ ఐఏఎస్ కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలియడంతో కిలాడీ లేడీ విశాఖ నుంచి విజయనగరం పారిపోయినట్టు సమాచారం.