మేము నలుగురమయ్యాం.. రోహిత్ శర్మ ఆసక్తికర పోస్ట్..!

-

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రోహిత్ భార్య రితికా సజ్దే నిన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మేము నలుగురమయ్యామంటూ సోషల్ మీడియాలో ఫ్యామిలీ అని రాసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ శుభవార్తను ఆయన అభిమానులతో పంచుకున్నాడు.

ఇక ఇప్పటికే రోహిత్ శర్మ-రితిక దంపతులకు సమైరా అనే కూతురు ఉంది. ఇప్పుడు వారికి పుత్రోదయం అయింది. డిసెంబర్ 13, 2015లో వీరి వివాహం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నారు వీరు. డిసెంబర్ 30, 2018లో వీరి జీవితంలోకి సమైరా వచ్చింది. బోర్డర్-గవాస్కర్ ట్రోపీ సమయంలో ఆడ కూతురు జన్మించింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ ల సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి చేరుకుంది. భార్య రెండో కాన్పు ఉండటంతో రోహిత్ శర్మ భారత్ లోనే ఉండిపోయాడు. టీమిండియా ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news