రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు.. 176 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

-

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ టీమ్ ఇండియా ల మధ్య మొదటి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కాగా… మొదట టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు… బ్యాట్స్మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కేవలం 43.5 ఓవర్లకు 176 పరుగులు చేసి ఆలౌట్ అయింది వెస్టిండీస్ జట్టు.

ఆది నుంచి టీమిండియా బౌలర్లు అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ ప్రదర్శించడంతో… వెస్టిండీస్ జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. వెస్టిండీస్ ఓపెనర్ హోప్ 8, బ్రాండన్ కింగ్ 12 పరుగులు చేశారు. అటు వెస్టిండీస్ కెప్టెన్ కిరణ్ పోలార్డ్ డకౌట్ అయ్యాడు. జాసన్ హోల్డర్ 57 పరుగులు ఫాబియన్ అలెన్ 29 పరుగులు చేసి వెస్టిండీస్ జట్టును ఆదుకున్నారు.

ఈ కార్డు టీమ్ ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే… ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా ప్రసిద్ధి కృష్ణ రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. ఆటో టీమిండియా స్పిన్నర్లు కూడా దాటిగా ఆడారు. స్పిన్నర్ చాహాల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి అదరహో అనిపించాడు. అటు వాషింగ్టన్ సుందర్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో వెస్టిండీస్ జట్టు కేవలం 176 పరుగులకే ఆలౌట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version