ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ 18, రికెల్టన్ 41, సూర్య కుమార్ యాదవ్ 40, తిలక్ వర్మ 59, హార్దిక్ పాండ్య 2, నమన్ దీర్ 38 పరుగులు చేశారు.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 1, విప్రజ్ నిగమ్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లను తీశారు. మొత్తం ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేశారు. అందులో ముగ్గురు బౌలర్లకు వికెట్లు పడగా.. ముగ్గురికి మాత్రం ఒక్క వికెట్ కూడా పడలేదు. ఈ సీజన్ లో ఢిల్లీ మంచి ఫామ్ లో కొనసాగుతోంది. కే.ఎల్. రాహుల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో అదే ఫామ్ కొనసాగిస్తుందా..? లేక ముంబై బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్ కి బ్రేకులు వేస్తారా వేచి చూడాలి మరీ.