IPL 2024: ట్రెండింగ్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 64 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.

Who is Nitish Reddy

ఇక నిన్నటి మ్యాచ్ లో మెరుపు అర్థ సెంచరీ తో హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు.ఈ మ్యాచ్ లో నితీష్ రెడ్డి 37 బంతులు 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదు సిక్సులు అలాగే నాలుగు ఫోర్స్ కొట్టాడు. అలాగే ఈ మ్యాచ్ లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో మాన్ అఫ్ ద మ్యాచ్ నితీష్ రెడ్డికి వచ్చింది. ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో నితీష్ రెడ్డి పేరు వైరల్గా మారింది. ఇన్ని రోజులు నితీష్ రెడ్డిని ఎందుకు పక్కకు పెట్టారని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news