చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ రోజు (అక్టోబర్ 26) ఆస్ట్రేలియా పర్యటనకు జట్టుని ఎంపిక చేయనుంది. బిసిసిఐ మరియు క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా అధికారికంగా మ్యాచ్ ల షెడ్యూల్ ని ప్రకటించలేదు. అయితే భారత జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్లు పోటీ పడనున్నాయి.
పరిమిత ఓవర్ల క్రికెట్ తో ఈ సీరీస్ ప్రారంభం కానుంది. సెలెక్షన్ కమిటీ మీటింగ్ నేపధ్యంలో అందరి దృష్టి రిషబ్ పంత్, శుబ్మాన్ గిల్, పృథ్వీ షా, హార్దిక్ పాండ్యా వంటి వారిపై ఉంటుంది. మిగిలిన వారి సంగతి పక్కన పెట్టి రిషబ్ విషయానికొస్తే… అతను జట్టులో బరువు కారణంగా చోటు కోల్పోయే అవకాశం ఉందని. అతను అధిక బరువుతో ఉన్నాడని… దీనితో అతనికి ఫిట్నెస్ లేదని భావిస్తున్నారు. యోయో టెస్ట్ నిర్వహించి అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బిసిసిఐ మరియు సెలెక్టర్లు పంత్ పై ఫిట్నెస్ నివేదికను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.