RR తో 2వ క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఇంపాక్ట్ రూల్ ను SRH సద్వినియోగం చేసుకుంది. ఇన్నాళ్లు పెద్దగా ప్రభావం చూపని షాబాజ్ అహ్మద్… నిన్నటి మ్యాచ్ లో ఇంపాక్ట్ గా వచ్చి బ్యాటింగ్ లో 18 రన్స్ చేశారు. స్పిన్ కు సహకరించిన చెపాక్ లో మూడు వికెట్లు తీసి పటిష్ట స్థితిలో ఉన్న RRను గట్టి దెబ్బ కొట్టాడు.
జోరు మీద ఉన్న యశస్వి జైస్వాల్ తో పాటు రియాన్ పరాగ్, అశ్విన్ లను పెవీలియన్ పంపి “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” గా గెలిచారు. కాగా, మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్ లలో 175 పరుగులు చేసింది. క్లాసన్, త్రిపాటి రాణించడంతో ఆమాత్రం స్కోర్ చేయగలిగింది హైదరాబాద్. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్ లో 7 వికెట్ నష్టపోయి 139 పరుగులు మాత్రమే చేసింది. ఈ తరుణంలో 36 పరుగుల తేడాతో హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది రాజస్థాన్. దీంతో… రాజస్థాన్ రాయల్స్ ఇంటి దారి పట్టింది.