అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్ కప్-2023 క్రికెట్ మహాసమరానికి సమయం ఆసన్నమైంది. ఇవాల్టి నుంచి వర్మప్ మ్యాచులు మొదలుకానుండగా… మెగా పోరు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లుచేసింది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే స్టేడియాలు సుందరంగా ముస్తాబయ్యాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో 10 టీములు ఒక్కో జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతాయి.
కాగా వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాక్ ప్లేయర్ల కోసం ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు. హైదరాబాది బిర్యానితో పాటు చికెన్, మటన్, ఫిష్, గ్రిల్ ల్యాంబ్ షాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటివి మెనూలో చేర్చారు. అలాగే స్టీమ్ బాస్మతి రైస్, బోలోగ్నీస్ సాసు తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన పాకె జట్టు రెండు వారాలపాటు హైదరాబాద్ లోనే ఉండనుంది.