రెజ్లర్ ది గ్రేట్ ఖలీ గురించి తెలియని వారు ఉండరు. ఇండియా తరఫున రెజ్లింగ్ ఆడుతున్న ఒకే ఒక్క క్రీడా కారుడు గ్రేట్ ఖలీ. ఏడు అడుగుల కంటే ఎత్తుగా ఉంటూ.. వెడల్పైన శరీరాకృతి గ్రేట్ ఖలీ సొంతం. అయితే.. తాజాగా గ్రేట్ ఖలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
భారతీయ జనతా పార్టీ లో గ్రేట్ ఖలీ చేరారు. ఇవాళ ఢిల్లీ లో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో… జాతీయ నేతల సమక్షంలో… ఖలీ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరడం తానకెంతో సంతోషంగా ఉందని… పార్టీ అభివృద్ధి కి పాల్పడతానని చెప్పారు.పార్టీని పంజాబ్ లో మరింత పటిష్టంగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని వెల్లడించారు. కాగా.. రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ది పంజాయ్ రాష్ట్రం. ప్రస్తుతం పంజాయ్ ఎన్నికలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే… రెజ్లర్ ది గ్రేట్ ఖలీకి బీజేపీ వల వేసింది. ఎప్పుడు సెలబ్రీటీలను టార్గెట్ చేసే బీజేపీ.. ఇప్పుడు ఖలీని పార్టీలోకి ఆహ్మానించింది.