సెకండ్ ఫాస్టెస్ట్ ఇండియన్ గా యశస్వి జైస్వాల్ రికార్డు..!

-

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు లో మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. అసీస్పై 74 ఇన్నింగ్స్ ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్పై కేవలం 9 ఇన్నింగ్స్ ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు. ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో బౌండరీ బాది టెస్ట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్ లో అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్ లోనే చేరుకున్నాడు. ఓవరాల్ గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండు చెందిన సచ్కిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news