కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలుసుకోబోయి ప్రాణాలు కోల్పోయిన ఓ గూఢచారి

-

ఉత్తర కొరియాలో ప్రజలపై తీవ్ర ఆంక్షలు ఉంటాయన్నవిషయం తెలిసిందే… ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన ఓ గూఢచారి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులను సక్రమంగా పాటిస్తున్నారా, లేదా అనేది తెలుసుకునేందుకు ప్రజలపై నిత్యం గూఢచారులు కన్నేసి ఉంచుతారు. అందుకోసం కిమ్ బ్యూరో-10 నిఘా ఏజెన్సీని కూడా స్థాపించాడు. ఈ బ్యూరో ఏజెన్సీలో పనిచేస్తున్న ఓ గూఢచారికి ప్రజలపై నిఘా వేసే విధులు అప్పగించారు. సాధారణంగా ఉత్తర కొరియాలో పౌరులకు ఇంటర్నెట్ సేవలు లభ్యం కావడం చాలా కష్టం.

అయితే ఈ ఉద్యోగి గూఢచారి కావడంతో ఇంటర్నెట్ వినియోగానికి అనుమతి లభించింది. కానీ అతడు ప్రజలపై నిఘా వేసేందుకు కాకుండా, దేశాధినేత కిమ్ గురించి వెదికేందుకు ఇంటర్నెట్ ఉపయోగించాడు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియడంతో, పాపం ఆ గూఢచారిని మరణశిక్ష విధించి అమలు చేశారు. మరికొందరు అధికారులు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినా, వారిని విధుల నుంచి తప్పించి అంతటితో సరిపెట్టకుండా వారికి కఠినమైన శిక్ష అమలు చేస్తారన్న సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version