విజయవాడలో ఈరోజు వైసీపీ ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయన్న సంగతి తెల్సిందే. రాజ్యాంగ వ్యస్థల పేరుతో ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూరుకునేది లేదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఫోటోలతో ప్లెక్సీలు స్థానిక క్యాడర్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే హైకోర్టుపై, న్యాయమూర్తుల తీర్పులను తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు వైసీపీ క్యాడర్. అప్పుడు కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి బహిర్గతంగా రాజ్యాంగ వ్యస్థలను టార్గెట్ చేసారని చెప్పచ్చు.
అయితే ఈ ప్లెక్సీల వివాదం పై న్యాయవాది శ్రావణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. వారధిపై రాజ్యాంగ వ్యవస్థలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయడం హేయమైన చర్యన్న ఆయన ఇలాంటివి చేస్తే ఆర్టికల్ 356 ప్రకారం ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంటుందని అన్నారు. ప్లెక్సీల వివాదంపై ప్రభుత్వం విచారణ చేపట్టి వారం రోజుల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవలాని లేకుంటే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను టార్గెట్ చేయడం వైసీపీ పతనానికి నాంది అనే విషయం వైసీపీ గుర్తించుకోవాలని ఆయన అన్నారు.