‘శ్రావణ సందడి’ షురూ.. సరికొత్త ప్రోగ్రామ్‌తో ముందుకొచ్చిన ఈటీవీ..

-

శ్రావణ మాసం సందర్భంగా మహిళలు చక్కగా వ్రతాలు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటిల్లి పాది అందరినీ అలరించేందుకు ఈటీవీ వారు సరికొత్త ప్రోగ్రాం తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయగా, అది బాగా వైరలవుతోంది.

‘జోరున్న ఆటలు, పసందైన పాటలు, ముచ్చటైన జంటలు’ అనే కాన్సెప్ట్స్ తో ఈ షో ఉండబోతున్నదని ప్రోమోలో తెలిపారు. ఇక ఇందులో కమెడియన్స్ ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ప్రముఖ నటుడు నవీన్ చంద్ర, అనసూయ ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు.

‘భక్తి భావనతో నిండిన సంబరాల సందడి’ని ప్రతీ ఒక్కరి ఇళ్లలోకి తీసుకురావడానికి శ్రావణ మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో ఈటీవీలో ప్రసారం చేయబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక ఈ ప్రోమోలో స్పెషల్ అట్రాక్షన్ గా ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేశ్ -‘బిగ్ బాస్’ సుజాత.. నిలిచారు.

తమ ప్రేమ ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదని, షో కోసం చేసే షో ప్రేమ కాదని పేర్కొన్న రాకింగ్ రాకేశ్.. జీవితం కోసం జీవితాంతం కలిసే ఉండే ప్రేమని చెప్పాడు. అనంతరం ‘జబర్దస్త్’ రాకింగ్ రాకేశ్ -‘బిగ్ బాస్’ సుజాత..కౌగిలించుకున్నారు. అలా వారి ప్రేమ తుది దశకు చేరుకుందని సంకేతాలిచ్చారు. జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ షోకు యాంకర్స్ గా రవి, అనసూయ వ్యవహరించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version