మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే… ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి సోమవారం గాంధీ భవన్ కు వచ్చారు. ఆ సమయంలో పార్టీ నేతలు ఉత్తమ భట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రాజనర్సింహ అక్కడే ఉన్నారు.
స్రవంతి, ఎంపీ కోమటిరెడ్డి వద్దకు వెళ్లి ‘అన్నా, ఒక్కసారి ప్రచారానికి రండి అన్నా’ అని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ ‘నీకెందుకు అమ్మ. నేను చెప్పాను కదా, నేనున్నాను’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇక పాల్వాయి స్రవంతి గెలవాలని కోమటిరెడ్డి ఆశీర్వదించినట్లు ఉందని ఆ ఫోటోను కాంగ్రెస్ పార్టీ నేతలు షేర్ చేశారు.
ఇది ఖచ్చితంగా ఆశీర్వాదమే! @INCTelangana pic.twitter.com/nPfrQHFkFF
— DONTHU RAMESH (@DonthuRamesh) October 17, 2022