టీ ట్వంటీ ప్రపంచ కప్ 2021 లో భాగంగా… ఇవాళ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్ల మధ్య భీకర పోరు సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో… శ్రీలంక జట్టు అద్భుత విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని… కేవలం 18.5 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది శ్రీలంక జట్టు. శ్రీలంక బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే… పాతుం నిశ్శంక 24 పరుగులు, చరిత్ అసలంక… 80 పరుగులు నాటౌట్, భువన రాజపస్క 53 పరుగులు చేసి శ్రీలంక జట్టుకు భారీ విజయాన్ని అందించారు.
చేజింగ్ కు దిగిన శ్రీలంక జట్టు ప్రారంభం నుంచి ధీటుగానే ఆడింది. ఈ నేపథ్యంలోనే 18 ఓవర్లలోనే… లక్ష్యాన్ని సాధించి టీ20 ప్రపంచకప్ లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది శ్రీలంక జట్టు. ఈ అటు మొదట బ్యాటింగ్ చేసిన… బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో… కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. నయీమ్ 62 పరుగులు, రహీం 57 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. అయితే బంగ్లా బౌలర్లు విఫలం కావడంతో… శ్రీలంక జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.