సెహ్వాగ్‌, క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్ చేసిన శ్రీలంక ప్లేయర్

-

వ‌న్డే క్రికెట్‌లో మ‌రో డబుల్ సెంచరీ న‌మోదైంది. అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మొదటి వన్డేలో శ్రీలంక ఓపెనర్ నిస్సాంక డబుల్ సెంచరీ సాధించారు. 139 బంతుల్లోనే 20 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 210 పరుగులతో నాటౌట్ గా నిలిచి శ్రీలంక తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిస్సాంక రికార్డు నెలకొల్పాడు.ఈ క్ర‌మంలో నిస్సాంక క్రిస్‌గేల్‌, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. గేల్ 138 బంతుల్లో, వీరేంద్ర సెహ్వాగ్ 140 బంతుల్లో డబుల్ సెంచరీలను అందుకున్నారు. అంతేకాకుండా శ్రీలంక మాజీ ఆటగాడు జయసూర్య పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత పరుగుల (189) రికార్డు 24 సంవత్సరాల తర్వాత బద్దలు కొట్టాడు.

పురుషుల వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 12 డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీలను బాదారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గిల్, ఇషాన్ కిషన్, గప్టిల్, గేల్, జమాన్, మ్యాక్స్ వెల్, నిస్సాంక ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఇండియా నుంచే ఐదుగురు ప్లేయర్లు ఉండటం గమనార్హం. అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్ శర్మ(264) పేరిట ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version