పది సినిమాల్లో నటిస్తూ ఆల్మోస్ట్ టాలీవుడ్ స్టార్లను కవర్ చేసేసిన శ్రీ లీల.. మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసిందా..!

-

శ్రీ లీల.. అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. 2019లో వచ్చిన కిస్ అనే కన్నడ చిత్రంతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరియర్ లో దూసుకెళ్లిపోయింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా శ్రీలీల కెరీర్ కు మంచి ప్లస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో దాదాపు 10 సినిమాలకు సైన్ చేసి క్రేజీ హీరోయిన్గా మారిపోయిన శ్రీ లీల మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం కొట్టేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్స్ లో శ్రిలీల ఒకరు. ముఖ్యంగా తన అందంతో, అభినయంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న ఈ భామ చేసిన తక్కువ సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం దర్శక, నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా తరికెక్కిన ధమాకా చిత్రంలో హీరోయిన్గా నటించిన స్త్రీ లీలా ఈ సినిమా హిట్ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా అనంతరం వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో శ్రీ లీల నటిస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్బికె 108 చిత్రంలో బాలకృష్ణకు కుమార్తెగా ఈ భామ కనిపించనుంది ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీల నటిస్తుంది. ఇందులో రామ్ పోతినేని హీరోగా కనిపించనున్నారు. దర్శకుడు వక్కంతో వంశీ నితిన్తో తెరకెక్కిస్తున్న నితిన్ 32 సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా కనిపించనుంది. అలాగే యువ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు చిత్రంలో శ్రీ లీల కనిపించనుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాది భగత్ సింగ్ సినిమాలో శ్రీ లీల కనిపించని ఉందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న pt 04 మూవీలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా రాబోతున్న జూనియర్ చిత్రంలో ఈ సినిమా హీరో ఈ భామ హీరోయిన్ గా కనిపించినట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఇన్ని సినిమాలు చేతిలో పెట్టుకున్న ఈ భామ.. తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గౌతమ్ తిమ్మనూరి దర్శకత్వంలో నటిస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీ లీల అవకాశం కొట్టేసినట్టు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు ఎక్కుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం అధికార ప్రకటన ఇచ్చేవరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version