రష్మిక కే చెక్ పెట్టిన శ్రీ లీల.. కట్ చేస్తే..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్లు రష్మిక, శ్రీ లీల అనే చెప్పాలి. ఈ ఇద్దరు కూడా స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతూ దూసుకుపోతున్నారు. అంతేకాదు ఇప్పుడు వారిద్దరి మధ్య విపరీతమైన పోటీ కూడా నెలకొనిందని చెప్పాలి. డైరెక్టర్ లు కూడా హీరోయిన్లు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. సాధారణంగా కొన్ని సినిమాలలో ఎంపిక చేసుకున్న హీరోయిన్స్ ను ఏదో ఒక కారణం చేత తప్పించి వేరే వారిని తీసుకుంటూ ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్టు నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక తప్పుకున్నట్లు సమాచారం.

అంతేకాదు ఆ ప్లేస్ లోకి మరో యంగ్ హీరోయిన్ అయిన శ్రీ లీలా రావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తున్న రష్మిక మరొకవైపు పుష్ప2, రెయిన్బో వంటి సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు భీష్మ కాంబినేషన్లో నితిన్ కి జోడిగా మరో చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశాన్ని దక్కించుకుందని సమాచారం. ఇక భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి రష్మిక ను తొలగించి ఆమె స్థానంలో శ్రీ లీల ను తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం చిత్రంలో కూడా పూజా హెగ్డే స్థానంలో శ్రీ లీలాను తీసుకోవడం, మరొకవైపు రష్మిక స్థానాన్ని కూడా శ్రీ లీల లాగేసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా మరొకసారి క్రేజీ కాంబో రిపీట్ కాబోతోందని ఆశించిన అభిమానులకు మళ్ళీ నిరాశే మిగిలిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news