పనితీరు బాలేదని ఉద్యోగుల మెడకు గొలుసుకట్టి.. కుక్కలా నడిపించి!

-

పనితీరు బాలేదని ఓ ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ ఉద్యోగుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించింది. సభ్యసమాజం తలదించుకునేలా ఆ సంస్థ ప్రవర్తన తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోటి ఉద్యోగులు ఇదేంటని ప్రశ్నించకుండా కొందరు ఎంజాయ్ చేయడాన్ని మనం వీడియోలో గమనించవచ్చు.

వివరాల్లోకివెళితే.. కేరళలోని కలూరుకు చెందిన ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులపై అమానవీయంగా ప్రవర్తించింది. ఉద్యోగుల మెడకు కుక్క గొలుసులు కట్టి మోకాళ్లపై నడిపించి, నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు కంపెనీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news