శ్రీసిటీ లో రూ. 1600 కోట్లతో ప్లాంట్ ను విస్తారణ…

-

నెల్లూరు జిల్లాలోని తడ దగ్గర శ్రీసిటీ అనే పారిశ్రామిక వాడను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ పారిశ్రామిక వాడలో అనేక రకాల ఉత్పత్తులను కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఈ శ్రీసిటీ వలన చుట్టుపక్కల ఉన్న గ్రామాల యువతీ యువకులకు ఉద్యోగాలు లభించాయి. ఈ కంపెనీ లలో మండెలెజ్ పేరుతో క్యాడ్ బరీ డైరీ మిల్క్, ఒరియా, బోర్నవిటా బ్రాండ్ చాకోలెట్ లను తయారు చేస్తుంది. కాగా ఇప్పుడు ఈ సంస్థను మరింతగా విస్తరించడానికి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 1600 కోట్లు ఖర్చు చేసి సంస్థను విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించిన శంకుస్థాపనను నిన్న ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆన్లైన్ లో చేసిన విషయం తెలిసిందే.

 

 

రాను రాను చాకోలెట్ లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్లాంట్ ను ఎక్స్టెండ్ చేయాలను నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వలన డైరెక్ట్ గా 500 మందికి ఉద్యోగం లభిస్తుంది మరియు 18000 మంది రైతులకు ఇది ఉపయోగం కానుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version