నిర్మాతకు నష్టం రాకూడదని తండ్రి చనిపోయినా షూటింగ్ పూర్తి చేసి వెళ్లిన శ్రీదేవి..

-

శ్రీదేవి అంటే అలనాటి అందాల నటి అతిలోకసుందరి అని గుర్తుకు వస్తూ ఉంటుంది కానీ ఈమె వ్యక్తిత్వం గురించి సమాజానికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఆమె గురించి చెప్పాలి అంటే.. లమ్హే షూటింగ్ టైమ్ జరిగిన ఒక విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి..

 

శ్రీదేవి మొదటగా తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆమె బాలీవుడ్లోకి వెళ్ళగానే వరుస సినిమాలు క్యూ కట్టాయి.. ఆ సమయంలో గురుదేవ్, రూప్ కి రాణి చోరోంకా రాజా, లమ్హే చిత్రాలు షూటింగ్ జరుగుతున్నాయి అయితే.. లమ్హే షూటింగ్ టైమ్ లో శ్రీ దేవికి తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె వెళ్లిపోతే నిర్మాతకు నష్టం వస్తుందని ఉద్దేశంతో ఆరోజు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని మద్రాస్ వెళ్లారు శ్రీదేవి తను వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ వచ్చి షూటింగ్లో పాల్గొన్నారు.. ఆ రోజు అనుపమ్ ఖేర్ తో ఒక కామెడీ సీన్ లో యాక్ట్ చేసిన శ్రీదేవిని చూసిన చిత్ర బృందం అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు..  నిర్మాతల విషయంలో ఎంతో ఔదార్యంతో ప్రవర్తించే వారంట శ్రీదేవి

తండ్రి చనిపోయిన కొన్నాళ్లకే శ్రీదేవి తన తల్లిని కూడా కోల్పోయారు తన తల్లిని కాపాడుకోవడానికి ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ తీసుకువెళ్లారు అయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది ఆ వయసులో తల్లి తండ్రి ఇద్దరినీ కోల్పోయిన శ్రీదేవి సొంత చెల్లెలు శ్రీలత, స్టెప్ బ్రదర్ సతీష్ ను అక్కున చేర్చుకుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ వచ్చారు శ్రీదేవి..

Read more RELATED
Recommended to you

Latest news