ఆర్ధిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే బియ్యం, డిజిల్, మందులను శ్రీలంకకు భారత్ సరఫరా చేసింది. మరింత సాయం చేసేందుకు ముందుకు వస్తోంది. భారత్ చేస్తున్న ఈ సాయంపై శ్రీలంక ప్రశంసలు కురిపిస్తోంది. కష్టకాలంలో మాకు సాయం చేసిందుకు ఇండియాకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపార ఆదేశ మాజీ స్టార్ క్రికెటర్ సనత్ జయసూర్య. భారత్ మాకు సాయం చేస్తుందని… మా పెద్దన్న ఇండియానే అని అన్నారు జయసూర్య. పొరుగుదేశంగా మాకు భారత్ ఎల్లప్పుడూ సహాయం చేస్తుందని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకలో బతకడం అంత సులభం కాదని ఆయన అన్నారు. భారత్ తో పాటు ఇతర దేశాల సాయంతోనే శ్రీలంక సమస్యల నుంచి బయటపడుతుందని అన్నారు. గ్యాస్ కొరత, గంటల తరబడి కరెంట్ సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… అందుకే నిరసనలకు దిగుతుతన్నారని జయసూర్య అన్నారు. తాము కష్టాల్లో ఉన్నామని ప్రభుత్వానికి తెలిపేందుకే ప్రజలు బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం సక్రమంగా స్పందించకుంటే శ్రీలంక పెను విపత్తును ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.