2ND T20I : ప్చ్.. లంక చేతిలో ఇంగ్లాండ్ కు ఘోర పరాభవం !

-

ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన శ్రీలంక మహిళలు రెండవ టీ 20 మ్యాచ్ లో గెలుపు రుచి చూశారు. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ఆటపట్టు బౌలింగ్ ఎంచుకుని బలమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న ఇంగ్లాండ్ మహిళలను కేవలం 104 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. అనంతరం సాధాసీదా లక్ష్యంతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంక మహిళలు ధనాధన్ ఇన్నింగ్స్ తో కేవలం 13 .2 ఓవర్ లలోనే లక్ష్యాన్ని ఎంతో సునాయాసంగా ఛేదించి ఇంగ్లాండ్ గడ్డపై విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ గా వచ్చిన శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంది.. కేవలం 31 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు మరియు 2 సిక్సులు సహాయంతో 55 పరుగులు చేసి గెలుపుకు పునాది వేసింది. ఆ తర్వాత ఈమె అవుట్ అయినా హర్షిత మాధవి 30 మిగిలిన పనిని పూర్తి చేసింది.

ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం… ఈ విజయంతో శ్రీలంక పరువును కాపాడుకుంది. దీనితో మూడు మ్యాచ్ ల సిరీస్ కాస్త 1 – 1 తో సమం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news