ఆసియా కప్ లో ఎంతో కీలక మ్యాచ్ అయిన ఇండియా మరియు పాకిస్తాన్ ది వర్షం కారణంగా అర్దాంతరంగా ఆగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 266 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇందులో ఇషాన్ 82 పరుగులు మరియు పాండ్యాలు 87 పరుగులు చేశారు. కానీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. దీనితో ఇరు జట్ల అభిమానులు పూర్తి నిరాశలో మునిగిపోయారు. ఇంకా చిన్నపాటి వర్షం పడుతుండడంతో మ్యాచ్ ను స్టార్ట్ చేయడం కుదరడం లేదని అంపైర్లు చెప్పేశారు. ఒకవేళ వర్షం కనుక ఆగిపోయి మ్యాచ్ స్టార్ట్ అయితే పూర్తి ఓవర్ లు ఆడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మ్యాచ్ సమేతం దాదాపుగా ధాటి పోయింది.. ఇప్పుడు పాకిస్తాన్ కొంతసేపటి తర్వాత బ్యాటింగ్ కు వస్తే .. ఆ సమయాన్ని బట్టి 40 ఓవర్ లు ఆడిస్తే 239 పరుగులు చేయాల్సి ఉంటుంది, ఒకవేళ 30 ఓవర్లు ఆడిస్తే 203 పరుగులు చేయాలి..
అది కూడా సాధ్యం కాకపోతే టీ 20 మ్యాచ్ జరిగినా పాకిస్తాన్ 155 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇది పాకిస్తాన్ కు చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి .. మరి ఇవన్నీ జరగడానికి వరుణుడు సహకరిస్తాడా చూడాలి.